District News

వంశధార రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం, ప్యాకేజీ అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారానికి 23వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిర్వాసితులు ఐక్యంగా పోరాడాలన్నారు. నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు యూత్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతోందని, ఒక్కో నిర్వాసితునికి ఒక్కో ప్యాకేజీ అమలు చేయడం సరికాదని సూచించారు...

   ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని కార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపిఎన్‌జిఒ సంఘ 19వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఆ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌జిఒల రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న కాంట్రాక్టు, కంటింజెంట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందన్నారు. ఉపసంఘం సిఫార్సుల మేరకు ఆయా ఉద్యోగులను...

వంశధార నిర్వాసితుల పాదయాత్ర
కష్టాలను చెప్పుకోవడానికి బయలుదేరిన నిర్వాసితులు
మరో పోరాటానికి సిద్ధమైన బాధితులు
పాదయాత్రకు విశేష స్పందన

     వంశధార నిర్వాసితులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టిన వారు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో, పాదయాత్రకు సంకల్పించారు. ప్రజల్లోకి వెళ్లి తమపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. పునరావాసం, పరిహారం విషయంలో జరుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి సమాయత్తమయ్యారు. ప్రభుత్వ తీరుతో తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లను వివరించేందుకు బయలుదేరారు. పునరావాసం పూర్తి చేసిన తర్వాతే...

ప్రయివేటు రంగంలో దామాషా పద్ధతి (జనాభా నిష్పత్తి)లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్‌ పోరాట సాధన కమిటీ సలహాదారు కె.ఎస్‌.చలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో 'ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి' అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కె.ఎస్‌.చలం మాట్లాడారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అనుసరించి ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సామాజిక వైరుధ్యాలను...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భూ దాహం ఎక్కువైందని భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ దడాల.సుబ్బారావు అన్నారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు 15 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు బుధవారం సంఘీభావం తెలిపిన అనంతరం సుబ్బారావు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో భూ బ్యాంక్‌ పేరుతో 15 లక్షల ఎకరాలను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రైతులు, కూలీల పొట్ట కొట్టే భూ బ్యాంక్‌ను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పగటి...

కొవ్వాడ అణుపార్కును ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రను వినాశనం చేస్తారా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. కొవ్వాడ అణుపార్కును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యాన 102 మంది కార్మికులు మంగళవారం రక్తదానం చేశారు. మండలంలోని అరిణాం అక్కివలసలో శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-3 పరిశ్రమ వద్ద చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని నర్సింగరావు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లో నిషేధిస్తున్న ఇలాంటి పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, ప్రజలకు భద్రత లేని, అవసరాలు తీర్చని పరిశ్రమలను వద్దం టున్నామని స్పష్టం చేశారు. తమ హక్కుల కోసమే కాకుండా సామాజిక బాధ్యతనూ...

 వంశధార నిర్వాసితులకు పునరావాసం, 2013 ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అప్పటివరకూ పనులు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సీతారామారావును సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోరాడ నారాయణరావు, వంశధార నిర్వాసిత సంఘం ప్రతినిధి జి.సింహాచలం వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ జలాశయం పనులు చేపట్టి దశాబ్దకాలం పూర్తయినా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పంచలేదని తెలిపారు. ధరలు పెరిగినా, చట్టాల్లో మార్పు వచ్చినా ఒక నిర్దిష్ట కాలంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ప్రభుత్వ...

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకే ఇటీవల అస హన ధోరణులు, దాడులు పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిన్నతంపై మతోన్మాద దాడులు, అసహన ధోరణు లకు నిరసనగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోనూ సిపిఎం ప్రచార యాత్ర లు నిర్వహిస్తోంది. అందులోభాగంగా బుధవారం శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు నిర్వహించారు. అసహన ధోరణులకు వ్యతిరేకంగా, మత సామరస్యం కోరుతూ సిపిఎం శ్రీకాకుళం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాయివీధిలో మతసామరస్యంపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసు మాట్లాడుతూ, ప్రజలను మత...

నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర అభివృద్ధి సదస్సు రణస్థలంలోని దేవిశ్రీ కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోనే అత్యధిక వర్షపాతం, 16 జీవనదులు, మరెన్నో జీవగెడ్డలు ఉన్నాయని, అయినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం కరువుపీడిత ప్రాంతంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జ్యూట్‌, ఫెర్రోఎల్లాయీస్‌ పరిశ్రమలు మూతపడి 30 వేల మందికి ఉపాధి పోయిందన్నారు. ఉత్తరాంధ్రలో విపరీతమైన కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మాత్రమే...

 ఏజెన్సీలో గిరిజన విద్యను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎంపీ, ఎపి గిరి జన సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ మిడియం బాబూరావు విమర్శించారు. గిరిజన విద్యను పరిరక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన జీపుయాత్రను బాబూరావు మారేడుమిల్లిలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. దీంతో వారు రక్తహీనతతో చనిపోతున్నారని చెప్పారు. సౌకర్యాలు కల్పించ డంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శిం చారు. గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయన్నారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

Pages