District News

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు. జెఎన్‌టియులో విద్యార్థులకు సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి...

           ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేపడుతున్న అభివృద్ధి పనులపై అలసత్వం వహించవద్దని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. గురువారం టెక్క‌లి మండలంలోని శ్యామసుందరాపురంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్లు, కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మహిళ కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సక్రమంగా సరుకులు పంపిణీ కావడం లేదని ఫిర్యాదుచేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ జన్మభూమి కమిటీలకు అప్పగించామని, వారినే అడగాలని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వై రవీంద్రకుమార్‌, ఎంపిపి మట్ట సుందరమ్మ, సర్పంచ్‌ బెహరా కృష్ణవేణి పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తోందని, వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. గురువారం నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫార పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ చదువు కోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు భాధ్యతాయతంగా మెలిగి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తర్ర రామకృష్ణ, ఎంఇఒ నక్క రామకృష్ణ పాల్గొన్నారు.

         ఎన్నికల హామీలను నెర వేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి విమర్శించారు. గురువారం కంచిలి మండలంలోని గొల్లకంచిలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 71 వేలు ఫిర్యాదులొస్తే 90 మాత్రమే పరిష్కరించారని దుయ్యబట్టారు. ఉద్యోగాలిప్పి స్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో వైసిపి ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, కృష్ణారావు, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

వంశధార రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం, ప్యాకేజీ అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారానికి 23వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిర్వాసితులు ఐక్యంగా పోరాడాలన్నారు. నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు యూత్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతోందని, ఒక్కో నిర్వాసితునికి ఒక్కో ప్యాకేజీ అమలు చేయడం సరికాదని సూచించారు...

   ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని కార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపిఎన్‌జిఒ సంఘ 19వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఆ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌జిఒల రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న కాంట్రాక్టు, కంటింజెంట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందన్నారు. ఉపసంఘం సిఫార్సుల మేరకు ఆయా ఉద్యోగులను...

వంశధార నిర్వాసితుల పాదయాత్ర
కష్టాలను చెప్పుకోవడానికి బయలుదేరిన నిర్వాసితులు
మరో పోరాటానికి సిద్ధమైన బాధితులు
పాదయాత్రకు విశేష స్పందన

     వంశధార నిర్వాసితులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టిన వారు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో, పాదయాత్రకు సంకల్పించారు. ప్రజల్లోకి వెళ్లి తమపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. పునరావాసం, పరిహారం విషయంలో జరుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి సమాయత్తమయ్యారు. ప్రభుత్వ తీరుతో తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లను వివరించేందుకు బయలుదేరారు. పునరావాసం పూర్తి చేసిన తర్వాతే...

ప్రయివేటు రంగంలో దామాషా పద్ధతి (జనాభా నిష్పత్తి)లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్‌ పోరాట సాధన కమిటీ సలహాదారు కె.ఎస్‌.చలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో 'ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి' అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కె.ఎస్‌.చలం మాట్లాడారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అనుసరించి ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సామాజిక వైరుధ్యాలను...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భూ దాహం ఎక్కువైందని భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ దడాల.సుబ్బారావు అన్నారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు 15 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు బుధవారం సంఘీభావం తెలిపిన అనంతరం సుబ్బారావు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో భూ బ్యాంక్‌ పేరుతో 15 లక్షల ఎకరాలను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రైతులు, కూలీల పొట్ట కొట్టే భూ బ్యాంక్‌ను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పగటి...

కొవ్వాడ అణుపార్కును ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రను వినాశనం చేస్తారా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. కొవ్వాడ అణుపార్కును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యాన 102 మంది కార్మికులు మంగళవారం రక్తదానం చేశారు. మండలంలోని అరిణాం అక్కివలసలో శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-3 పరిశ్రమ వద్ద చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని నర్సింగరావు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లో నిషేధిస్తున్న ఇలాంటి పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, ప్రజలకు భద్రత లేని, అవసరాలు తీర్చని పరిశ్రమలను వద్దం టున్నామని స్పష్టం చేశారు. తమ హక్కుల కోసమే కాకుండా సామాజిక బాధ్యతనూ...

Pages