District News

శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ప్లాంటుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూములను కేటాయిస్తూ 2009లో 1107 జీవో విడుదల చేసింది. సర్వేనెంబరు 152/2లో 972 ఎకరాల భూమిని ఎన్‌సిసి లిమిటెడ్‌కు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి కేటాయించింది. పవర్‌ప్లాంట్‌ నిమిత్తం కేటాయించిన ఈ భూమికి చెందిన రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆ ప్రాంతంలో వివిధ రూపాలలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలను, భూమి కోల్పోతున్న రైతులను ప్రజా...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఒక్క ఎకరా కూడా గుంజుకో నివ్వబోమని, అడ్డగోలు భూ సేకరణను కలిసికట్టుగా అడ్డుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణపై రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పేదోళ్ల భూములే దొరికాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో 13జిల్లాల్లోనూ చంద్రబాబు 15లక్షల ఎకరాలు భూసేకరణ చేపడుతున్నాడని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు. అవసరాలకు మించి భూములు గుంజుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఉద్యమం జరగబోతుందని, దీనికి అందరూ సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు....

శ్రీకాకుళం జిల్లా సోంపేట చిత్తడి నేలల్లో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 329ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. చిత్తడి నేలల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించడం చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చిత్తడి నేలల సంరక్షణ చట్టంలోని 4 (1) (ఱఱ) ప్రకారం బోట్‌ జెట్టీ తప్ప, ఇతర ఏ కట్టడమూ నిర్మించరాదని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, స్థానిక ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

ఏళ్లతరబడి సాగు చేసుకొంటున్న భూములను పేదల నుంచి బలవంతంగా తీసుకునే సత్తా ప్రభుత్వంతోపాటు ఎవరికీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించ తలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ ప్రభావిత ప్రాంతాలైన సన్యాసిరాజుపేట, ఓదిపాడు, తోటాడ గ్రామాల్లో శుక్రవారం ఆయన పరిశీలించారు. పోలాకి మండల కేంద్రంలో రైతులతో మాట్లాడారు. జిఒ 1307 ప్రకారం బలవంతంగా భూములు లాక్కోవడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 థర్మల్‌ ప్రాజెక్టులున్నాయని, రాష్ట్రావసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి ఉండగా, ఇంకా కొత్త పవర్‌ ప్లాంట్ల అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

సెప్టెంబర్‌ 2న జరిగే సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా హిందూపురంలో ప్రారంభమైన బస్సు జాతా సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించింది.

 

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి మధు అక్రమ నిర్బంధం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి పరాకాష్ట. పోలాకికి పాతిక కిలోమీటర్ల ముందే ఆముదాలవలన రైల్వే స్టేషన్‌లోనే మధును పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య. పైగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేసేందుకు ఆయన సెల్‌ ఫోన్‌ గుంజుకోవడం, మారు మూల ప్రాంతానికి తరలించడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి. బుధవారం ఉదయం ఆరు గంటలకు మధును అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయనను స్టేషన్‌లో నిర్బంధించారు. తన అరెస్టుకు కారణం అడిగితే పై అధికారుల...

శ్రీకాకుళం జిల్లా పోలాకి ధర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భంధాన్ని ఖండించాలని శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటుతో ఉపాధి కలగకపోగా రైతులకు , వ్యవసాయ కూలీలకు వున్నా ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేసారు .. అభివృద్ధి పేరుతొ రైతుఅల్ నోట్లో మట్టి కొట్టాలని చుస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ,త్వరలో పోలకిలో పర్యటిస్తామని అన్నారు. 

Pages