District News

ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి. 
రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేసినా ప్రజలు రాజమండ్రికి పెద్ద ఎత్తున తరలి వస్తారని ప్రభుత్వానికి తెలుసు....

రైతుల భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూనుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యాన సోంపే టలో మంగళవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న విమానా శ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా తిరుగుతున్న సింగపూర్‌ అంతర్జాతీయ విమానా శ్రయం కూడా 1200 ఎకరాల్లోనే నిర్మించారని గుర్తుచేశారు. రైతులనుంచి తీసుకున్న భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు....

 మద్యం దుకాణాలకు వేలం పాడిన వారంతా ఇప్పుడు తలలు పట్టుకురటున్నారు. లాభాలు బాగా ఉరటాయని ఈ వ్యాపారంలోకి వచ్చిన వారు తమ ఆదాయంలో సగ భాగాన్ని అప్పనంగా పరులకు ఇవ్వాల్సి రావడంపై వారంతా ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నురచి భారీగా వసూళ్లు చేసే నేతల సంఖ్య పెరిగిపోతోరదట. పది నురచి గరిష్టంగా 50 శాతం వరకు వారికి చెల్లిరచుకోవాల్సి వస్తోరదని వ్యాపారులు అరటున్నారు. మద్యం దుకాణాలపై వేలం ముగిసిన వెరటనే అనేక మంది సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిరచారు. ఆ ప్రారతంలో దుకాణాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి తమకూ వాటా కావాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోరది. అవసరమైతే వాస్తవ విలువపై 15 రూపాయలు అధికంగా వసూలు...

 ఐదో రోజూ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగింది. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. సమ్మెలో భాగంగా మంగళవారం విజయవాడలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(జెఎసి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వచ్చిన కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ రహదారిపై కార్మికులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో నిర్వహించారు. ఆ తరువాత ప్రెస్‌క్లబ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 'సమ్మె-ప్రభుత్వ వైఖరి'...

గుంటూరు జిల్లా‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే(బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఫస్టియర్ చదువుతున్న రుషితేశ్విని అనే విద్యార్థిని ఉరేసుకుంది. మృతురాలిది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

గోదావరి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా తొలి రోజు మంగళవారం ఉదయం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్ రెడ్డి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీవీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా పబ్లిసిటీ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు వెళ్లారని విమర్శించారు. ఆయన రాక కారణంగా రెండున్నర గంటల పాటు భక్తులను ఆపడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. జరిగిన దానికి బాబు కాశీకి వెళ్లి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని ఆయన అన్నారు.అన్నీ...

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడటంపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు.కృష్ణా పుష్కరలప్పుడు జరిగిన ఘటనపై ప్రతిపక్ష నాయకుడిగా తను చేసిన వ్యాక్యల్ని గుర్తుచేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.. 

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడిన కుటుంబాకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. అంతే కాకుండా క్షత గాత్రులను పరామర్శించేందుకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సీఎం చంద్రబాబును అడ్డగించే ప్రయత్నం చేశారు.అప్రమత్తమైన పోలీసులు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 26 మంది చనిపోవడం దురదృష్టకర సంఘటన అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అని తెలిపారు. యాత్రికుల సంఖ్యను అంచాన వేసి వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం పుష్కర స్నానం పూర్తయిన అనంతరం అధికారులు చేతులెత్తేయండతో ఈ ప్రమాదం జరిగిందని రాఘవులు అభిప్రాయపడ్డారు.

Pages