District News

అణు కేంద్రాలు సీసాలో బంధించిన పెను భూతాలని, ఎప్పుడు ప్రమాదమొస్తుందో తెలియదని, ప్రమాదం సంభవిస్తే ఎవరూ రక్షించలేరని భారత ఆర్థిక, ఇంధన వనరుల శాఖ విశ్రాంత కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ అన్నారు. కొవ్వాడ అణుపార్కు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వాన శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో కొవ్వాడ అణుపార్కుపై అణు నిపుణులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన సోమవారం చర్చా వేదిక జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శర్మ మాట్లాడుతూ, అణు వ్యర్థాలు అత్యంత విషతుల్యమని, ప్రమాదకరమని, సాంకేతికంగా వాటికి పరిష్కారం లేదని తెలిపారు. జపాన్‌లోని ఫుకుషిమాలో అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఆ దేశంలోని అణు ప్రాజెక్టులను మూసివేశారన్నారు. పర్యావరణ అనుమతుల్లేకుండా...

 ఆత్మహత్యలకు పాల్పడ్డ అనంతపురం రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అడ్డుకోవటానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుహెచ్చరించారు. హైదరాబాద్‌లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు తగిన శాస్తితప్పదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా తమ జాగీరుకాదన్న నిజాన్ని గ్రహించి జాగ్రత్తగా మసులుకోకపోతే పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి, ఆయన సొదరుడు ప్రభాకర్‌రెడ్డితీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుందని విహెచ్ హెచ్చరించారు. పార్టీ చంద్రబాబు టిడిపి ప్రజాప్రతినిధులను అదుపుచేయాలని ఆయన సలహా ఇచ్చారు. జాతీయ నాయకుడైన రాహుల్‌గాంధీ దేశంలో ఎక్కడైనా...

పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పరంగా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు.పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పుష్కర ఘాట్‌ల వద్ద అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి బయలుదేరి వెళ్లారు.

 రాజధాని పరిసర ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు, చిన్న, సన్నకారు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. సోమవారం విజయవాడలోని అటవీ శాఖ డిఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్‌), ఎంసిపిఐ(యు)లతో కలిపి ఆరు వామపక్ష పార్టీల నేతృత్వంలో భారీ ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమంలో విజయవాడ రూరల్‌, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల నుండి ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా...

గోదావరి పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మృతి చెందారు.పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఇక్కడ జరుగుతున్న పుష్కరాల్లో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఒకే ఘాట్ కు చేరుకున్నారు. దీనితో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసు యంత్రాంగం చేతులెత్తేశారు. భద్రతా వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపించింది. పది లక్షల జనాలు వస్తారని అంచనా వేసినా కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ రోజు విశాఖ ఏజెన్సీ అరుకు MPDO ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె. లోకనాధం మాటలాడుతూ విశాఖ జిల్లాలో హూద్ హూద్ తుఫాన్ వాళ్ళ పడిపోయిన సిల్వర్ ఒక్ చెట్లు తొలగించుటకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఒక సిల్వర్ చెట్టుకు రూ . 100 /-లు చొప్పున ఒక్కొక రైతుకు 150 చెట్లుకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికి చెల్లించకపోవడం దుర్మార్గం.ఒక అరుకు మండలంలోనే 14 పంచాయతీల పరిధిలో 170 గ్రామాల్లో ప్రభుత్వ అధికారులే సర్వ్ జరిపి 2574 మంది రైతులు నష్టపోయారని గుర్తించారు. వీరికి సుమారు 2 కోట్ల 26 లక్షల 98 వేలు పంపిణీ చేస్తామని NREGS, కాఫీ బోర్డ్ అధికారులు ప్రకటించారన్నారు . కానీ నేటికి సిల్వర్ ఒక్...

 విధ్వంసకర అభివృద్ధికి తాము వ్యతిరేకమని మానవ హక్కుల వేదిక 5వ జిల్లా మహా సభలో వక్తలు స్పష్టంచేశారు. నగరంలోని సిరిపురం కూడలిలోని బిల్డర్సు అసోసియేషన్‌ సభా వేదికలో ఆదివారం జిల్లా అధ్యక్షులు ఎం.శరత్‌ అధ్య్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ పదేళ్లుగా తమ సంఘం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, మానవ హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టులను, పరిశ్రమలను వ్యతిరేకిస్తామని తమ మీద నింద ఉందని, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, విధ్వంసకర అభివృద్ధిని మాత్రమే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పిసిపిఐఆర్‌ పేరుతో ఏర్పరచబోయే కోస్టల్‌ కారిడార్‌తో ప్రజల జీవనాధారం, పర్యావరణం దెబ్బతింటాయని, పోలాకిలో...

మన్యంలో బాక్సైట్‌ ఖనిజం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తూ విశాఖ మన్యంలోని తెలుగుదేశం, బీజీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు లేఖలు పంపినట్టు తెలిసింది. ఇవి మావోయిస్టు పార్టీ ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం, మరో నేత లక్ష్మి మన్యం పరిధిలోని మండలాలకు చెందిన పలువురికి అందినట్టు సమాచారం. బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్టు ప్రభు త్వం బహిరంగ ప్రకటన చేసేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మావోయిస్టులు ఆ లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది.

గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్‌ పుష్కర యాత్రికుల కోసం హెలీ టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకూ రాజమండ్రిలోని అన్ని పుష్కర ఘాట్లను ఆకాశమార్గాన హెలికాప్టర్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. గోదావరి జిల్లాల పిండివంటలతో ‘మెగా ఫుడ్‌ ఫెస్టివల్‌ ’ నిర్వహిస్తున్నారు. తిరుపతిసహా రాష్ట్రంలోని 13 ప్రధాన ఆలయాల నమూనాలను రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇవి భక్తులను అలరించనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, సినీ సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు భక్తులను అలరించనున్నారు. గోదావరి పుష్కరాల్లో ప్రజలు తాము పొందిన అనుభూతిని #MahaPushkaram2015 ట్విటర్‌ లేదా ఫేస్‌...

  ప్రజాసమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పేర్కొన్నారు. ఇందుకోసం ముందు నుంచి కృషి చేస్తున్న కమ్యూనిస్టు నాయకులను స్మరించు కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతపురం జిల్లాలో గుత్తిరామకృష్ణ అటువంటి మార్గదర్శ కుడే నని తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధులు, అనం తపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థా పకుల్లో ఒకరైన గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుక లను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ నిర్వహిం చింది. ఆదివారం అనంతపురం నగరంలోని ప్రెస్‌క ్లబ్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఇంతి యాజ్‌ అధ్యక్షతన జరిగిన శతజయంతి సందర్భంగా 'అనంత ఆణిముత్యం' పేరుతో గుత్తి రామకృష్ణ రచన లను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ...

Pages