బాబు కాశీకి వెళ్లి ప్రక్షాళన చేసుకోవాలి:జగన్‌

గోదావరి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా తొలి రోజు మంగళవారం ఉదయం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్ రెడ్డి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీవీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా పబ్లిసిటీ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు వెళ్లారని విమర్శించారు. ఆయన రాక కారణంగా రెండున్నర గంటల పాటు భక్తులను ఆపడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. జరిగిన దానికి బాబు కాశీకి వెళ్లి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని ఆయన అన్నారు.అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని జగన్  ప్రశ్నించారు. పాలకులే మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం వలనే ఇలాంటి అనర్థం జరిగిందని ఆరోపించారు. భక్తులను ఇప్పుడైనా ఇతర పుష్కర ఘాట్లకు తరలించి పరిస్థతిని సమీక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. జగన్ ఒకానొక దశలో మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.