
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 11 నవంబర్, 2026.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి,
ఆంధ్రప్రదేశ్.
విషయం : ఎన్నికల నిర్వహణ విధులలో పాల్గొన్న సిబ్బందికి నిధులు మంజూరు చేయాలని, తగిన సౌకర్యాల ఏర్పాటు కోరుతూ...
అయ్యా!
కార్పొరేషన్, మున్సిపల్, యంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు ముగిసి వారం రోజులు దాటింది. యంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏర్పాట్లకు, నిర్వహణకు, పోలీసు సిబ్బందికి భోజన సదుపాయాలకు ఖర్చును చాలా జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులు భరించారు. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకొని ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేసేట్లు చూడగలరని కోరుతున్నాను.
జివియంసి పరిధిలోని ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి 50% మాత్రమే చెల్లించారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అలాగే పోలింగ్ రోజున విధులు నిర్వహించిన టీచర్లు, ఇతర సిబ్బందికి సరైన సదుపాయాలు కల్పించనందున అనేక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది మహిళలకు మారుమÖల గ్రామాలకు విధులు కేటాయించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వారి భద్రత దృష్ట్యా మహిళలకు మారుమÖల పోలింగ్ కేంద్రాలకు కేటాయించకుండా చూడాలి. పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బందికి దారి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు.
కావున రాబోయే పంచాయతీ ఎన్నికలలో పై అంశాలు దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సిబ్బందికి సరైన సౌకర్యాలు, అలవెన్సులు అందేట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
