ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛ గా స్వతంత్రంగా ఓటేయండి రాష్ట్ర పుర పౌరులకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి.

స్క్రోలింగ్ / ప్రచురణార్థం / ప్రసారార్థం :
ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛ గా స్వతంత్రంగా ఓటేయండి 
రాష్ట్ర పుర పౌరులకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి.

రాష్ట్రంలో ఉన్న అధికార కూటమి నిర్బంధ, నిరంకుశ పాలనను ఎదిరించి ధైర్యంగా ఓటు వేయాలని వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

నేడు విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

గత, నేటి పాలకులు స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించకుండా నిర్వీర్యం చేశారు. ఫలితంగా ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా అపరిష్కృతంగా మిగిలి పోయాయి. దోమల బెడద, మంచినీళ్లు, డ్రైనేజీ , పన్నుల భారానికి తోడు అవినీతితో కంపు కొడుతున్నాయి.

ఈ స్థితిలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు మాత్రమే కేరళ తరహాలో ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన అందించగలవని పేర్కొన్నారు. అవినీతికి తావులేని స్థానిక సుపరిపాలనకు ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు వేయాలని వి. శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి