రాప్తాడు ఘటనపై సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి

స్క్రోలింగ్ / ప్రచురణార్థం / ప్రసారార్థం :
రాప్తాడు ఘటనపై సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి 
నిందితుడిని కఠినంగా శిక్షించాలి 
బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ 

అనంతపురం జిల్లా రాప్తాడులో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని పై జరిగిన ఘోర దూరంతరం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర దిగబ్రాంతి వ్యక్తం చేశారు.

అత్యంత రాక్షత్వం తో కూడిన ఈ ఘటనకు కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.  దారుణంగా గాయపడ్డ బాలికల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. 
ఆ అమ్మాయిని ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని, ఆమెను కాపాడాలని అలాగే ఆమెతో పాటు మరో విద్యార్థిని గాయపడిన ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని రీనివాసరావు కొట్టారు. 

ఈ దారుణ రాక్షస కృత్యానికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇలాంటి ఘటనలు పట్టపగలే స్కూలలో అందరూ చూస్తుండగానే జరగం అత్యంత ఆందోళనకరమని, రాష్ట్రంలోని పరిస్థితి కి ఇది అద్దం పడుతుందన్నారు.  తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్న ఇలాంటి ఘటనలను సహించరాదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.

-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి