సిఆర్‌డిఎ గ్రామాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 11 అక్టోబర్, 2026.
సిఆర్‌డిఎ గ్రామాల్లో  స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
- సిపిఐ(యం)

రాజధాని అమరావతి సిఆర్‌డిఎ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
సిఆర్‌డిఎ పరిధిలోకి వచ్చే రాజధాని గ్రామాల్లో  పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం లేదని సిఆర్‌డిఎ ప్రకటించడం ఆ గ్రామాల ప్రజల సమస్యలను విస్మరించటమే. గతంలోనున్న 29 గ్రామాలతో పాటు రెండో దశ భూసమీకరణ చేపట్టిన పంచాయితీల్లో కూడా ఎన్నికలు జరగవని చెప్పడం విడ్డూరంగా ఉంది. భూసమీకరణకు, స్థానిక ఎన్నికలకు సంబంధమే లేదు. ప్రజలున్నచోట ఎన్నికలు జరపాలి. రెండవ దశ, మూడవ దశలో కూడా లేని గ్రామాలు కూడా  సిఆర్‌డిఎ ప్రకటించిన లిస్టులో ఉండడం ఆశ్చర్యంగా ఉంది.
రాజధాని ప్రాంతంలో ప్రజల అభిప్రాయాలు, అభివృద్ధిపరమైన అంశాలుపై నిర్ణయాలు తీసుకునే వీలుండే స్థానిక వ్యవస్ధ లేకుండా చేయడం అప్రజాస్వామికం. స్థానిక సమస్యలు ఎవరికి చెప్ప్పుకోవాలో తెలియని స్థితిలో ప్రజలున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా పాలన జరగడం ప్రజాస్వామ్యం. కాబట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటుగా రాజధాని గ్రామాల్లో కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలనను పునరుద్దరించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి