సింగీతం శ్రీనివాసరావు మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 అక్టోబర్, 2026.
సింగీతం శ్రీనివాసరావు మృతికి సంతాపం
ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. సినీ రంగంలో అనేక సృజనాత్మక ప్రయోగాలు చేసి నిరూపించుకున్న కళామతల్లి బిడ్డ సింగీతం గారని శ్రీనివాసరావు కొనియాడారు.
సింగీతం శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతూ నాటక రంగంలో ప్రవేశం చేశారు. ఎటువంటి మాటలు లేకుండా కేవలం హావభావాలు పలికిస్తూ తీసిన ‘పుష్పక విమానం’ సినిమాతో రెండు జాతీయ పురస్కారాలతోపాటు ఐదు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన సుదీర్ఘ ప్రయాణం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ బాషల్లో దర్శకత్వం వహించారు. 94 ఏళ్ళ వయస్సులో చివరి చిత్రం ‘సింగ్ గీతం’  అనే సినిమాని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారన్నారు. ఆయన వైవిధ్య భరిత కథలతో సినీ ప్రియుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవారని కొనియాడారు. చైన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి