రైలు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 సెప్టెంబర్, 2026.

రైలు ప్రమాదంలో మృతిచెందిన
విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

శ్రీకాకుళం జిలా టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన నలుగురు గిరిజన విద్యార్థులు రైలు ప్రమాదంలో మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు నిరుపేదలు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది. తల్లిదండ్రులు పేదవారైనా పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనే ఎంతో ఆశతో ఉంటారు. కానీ చిన్న వయస్సులోనే ఆ విద్యార్థులు ప్రమాదానికి గురై మరణించడం విచారకరం. ప్రమాదంలో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి మెరుగైన వైద్యం అందించి, చికిత్సకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి