
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 సెప్టెంబర్, 2026.
నిరసన ప్రదర్శనపై లాఠీఛార్జీకి ఖండన
స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలి - సిపిఐ(యం)
డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల సమస్యపై ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు/ నిరుద్యోగులపై లాఠీచార్జీని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.
తమ సమస్యలపై నిరసన ప్రభుత్వానికి తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పార్టీలు, సంఘాలు, సంస్థల ప్రాథమిక హక్కు. ఆ హక్కును నిరాకరించడం అప్రజాస్వామికం.
సవాళ్ళకు ప్రతి సవాళ్ళు బదులుగా సమస్యను పరిష్కరించడానికి న్యాయ విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయి.
అలాగే ఉపాధ్యాయులను తమ ప్రయోజనాలకోసం అడ్డం పెట్టుకోవడం సమంజసం కాదని సిపిఐ(యం) భావిస్తున్నది. డిఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం తగు సమాధానాలు చెప్పకుండా ఉపాధ్యాయులను పోటీగా రంగంలోకి దింపడం సమస్యను మరింత జఠిలం చేస్తుంది. పరస్పర ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఇటువంటి చర్యలను మానుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
