
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 ఆగష్టు, 2026.
ఏటుకూరి కృష్ణమూర్తి మృతికి సంతాపం
స్వాతంత్య్ర పోరాట యోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి (102) గారి మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
గుంటూరు జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్రతోపాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను, ఛాయాచిత్రాలను, ఇది మాఊరు, ప్రజా వైద్యులు మొదలగు పుస్తకాలు రచించారు. తండ్రి సీతారామయ్య అందించిన జాతీయోద్యమ స్పూర్తితో స్వాతంత్య్రోద్యమ పోరాటంలో క్విట్ ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయనను 15 రోజులపాటు బ్రిటీష్ ప్రభుత్వం జైలులో నిర్బంధించింది. అనంతరం 1946లో జరిగిన ఉద్యమంలో 8 నెలల పాటు లాహోర్ జైలులోనే గడిపారు.
ఏటుకూరి కృష్ణమూర్తి గారి మరణం అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
