అక్రమ అరెస్టులకు ఖండన -సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 సెప్టెంబర్, 2026.
అక్రమ అరెస్టులకు ఖండన -సిపిఐ(యం)
నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు ఇచ్చారనే నెపంతో కాకినాడ జిల్లా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి, బైండోవర్ కేసులు పెట్టడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ త్రీవంగా ఖండిస్తున్నది. బైండోవర్ కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడం అన్యాయం.
కాకినాడ సిటీ సిపిఎం నాయకుడు పలివెల వీరబాబు, విద్యార్థి నాయకులు ఎం. జి.సూరిబాబు, యువజన నాయకులు టి.రాజా, ఆదర్శలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం గర్హనీయం. ఈరోజు పోలీసు స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం అప్రజాస్వామికం.
ఇటువంటి నిరంకుశ చర్యలను ప్రజలంతా ఖండించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి