సిపిఐ(యం) బృందాల కరువు పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 సెప్టెంబర్, 2026.
సిపిఐ(యం) బృందాల కరువు పర్యటన
రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. 655 మండలాల్లో వర్షాభావం నెలకొంది.  80% పంటలు వేయలేదు. వేసినచోట కూడా పంటలు దెబ్బతిన్నాయి. మంచినీరు కొరత, విద్యుత్ కోత మొదలైంది. ఉపాధి లేక కూలీలు అల్లాడుతున్నారు. దీనికి తోడు అధిక ధరల మోత. మొత్తం మీద ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నారు. రాష్ట్రంలో కరువు వల్ల సుమారు 5 లక్షల కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం  పరిస్థితి తీవ్రతకనుగుణంగా స్పందించి కరువు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. కేంద్ర బృందాలు పర్యటించి పరిస్థితిని అంచనా వేయలేదు.
ఈ నేపథ్యంలో సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3 కరువు బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి, బి.బలరాం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 21 వరకు ఈ మÖడు బృందాలు వివిధ జిల్లాల్లో పర్యటిస్తాయి.
(1) కె.ప్రభాకరరెడ్డి నాయకత్వంలో డి.రమాదేవి, వి.కృష్ణయ్య, సిహెచ్.బాబూరావు, యం.హరిబాబు ఆయా జిల్లాల పార్టీ కార్యదర్శులు బృందం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, పల్నాడు,  బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పర్యటిస్తుంది.
(2) బి.బలరాం నాయకత్వంలో బి.తులసీదాస్, కె.సుబ్బరావమ్మ, వై.వెంకటేశ్వరరావు, యం.సూర్యనారాయణ, ఆయా జిల్లాల పార్టీ కార్యదర్శులు బృందం తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తుంది.
(3) కె.లోకనాథం నాయకత్వంలో యం.రమేష్, వి.రాంభూపాల్, దడాల సుబ్బారావు ఆయా జిల్లాల పార్టీ కార్యదర్శులు బృందం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో పర్యటించనుంది.
స్థానికంగా కాబట్టి రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు కరువు పర్యటన బృందాన్ని కలిసి ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇబ్బందులు వివరించి జయప్రదం చేయాలని, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సహకరించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి