
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 సెప్టెంబర్, 2026.
బిసిలను మోసగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
బిసి రిజర్వేషన్స్‌పై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయకుండానే 34 శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించడం రాష్ట్ర ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేస్తున్నదని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా వెంటనే ఆ నివేదికను బహిరంగపరచాలనీ, బిసి రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆటంకంగా ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేయడానికి పార్లమెంటులో చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వంపై టిడిపి కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన రాజీవ్ ర్పుంన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ రకంగా హైకోర్టులో చెప్పడం రాష్ట్రంలోనే బిసి ప్రజలను మోసగించడమే.
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇంకా పరిశీలన దశలోనే ఉంటే స్థానిక సంస్థలు ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు 34% ఎలా కల్పిస్తారని హైకోర్టు ప్రశ్నించడం రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని వెల్లడిస్తున్నది.
ఇప్పటికే సిపిఐ(యం) నివేదికను బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని కోరినా ఎటువంటి స్పందన లేదు. స్వయంగా నిన్న హైకోర్టు ధర్మాసనం ఈ నివేదికను ఎందుకు బహిరంగపరచలేదని ప్రశ్నించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు.
సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో పార్లమెంటులో చట్ట సవరణకు ప్రయత్నం చేయకుండా 34% పేరుతో బిసిలను మోసగించే ప్రయత్నం చేయడం దుర్మార్గం.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను వెంటనే బహిరంగపరచాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిసి రిజర్వేషన్ల అమలుకు వీలుగా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని సిపిఐ(యం) కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అలా చేయనట్లయితే బిసిలను మోసగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నాటకం ఆడుతున్నదని ప్రజలు భావించాల్సి వస్తుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
