స్క్రోలింగ్ / ప్రచురణార్థం / ప్రసారార్థం :
మార్కాపురం జిల్లా కల్నూతల గ్రామంలో వెలిగొండ ఉద్రృతికి కొట్టుకుపోయిన కుటుంబం. టన్నెల్స్ నుండి నీటిని ఆపి నిర్వాసితుల ప్రాణాలను రక్షించాలి.
సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్.
వెలిగొండ ప్రాజెక్టులో పరిహారం అందక ఆఖరి వరకు ఎదురు చూసి నిరాశతో ఖాళీ చేసి వెళ్ళిపోతున్న ఒక కుటుంబం వాహనంతో సహా నీటి ఉద్రృతికి కొట్టుకుపోయి ఒకరు చనిపోయినట్లు మరో ఇద్దరు చెట్టు కొమ్మకు ఉన్నట్లు వస్తున్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రభుత్వం నిర్వాసితుల పట్ల నిర్దయగా వ్యవహరించి ప్రాణాలను సైతం బలి చేయడాన్ని సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.
ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు.
టన్నెల్స్ నుండి నీటిని ఆపి నిర్వాసితుల ప్రాణాలను రక్షించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేసారు.
తగిన ఏర్పాట్లు చేసి అందరినీ తరలించాకే నీటిని వదలాలని శ్రీనివాసరావు సూచించారు.
పరిహారం అందక పెండింగులో ఉన్న పేర్లు 31 లోగా ప్రకటిస్తామన్న ప్రభుత్వ హామీని వెంటనే నెరవేర్చాలి. ముందుగా కనీసం లిస్టు ప్రకటించి వున్నా ఈ ఘోరం జరిగి వుండేది కాదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి
