రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిరంగపర్చాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఆగష్టు, 2026.

 

రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిరంగపర్చాలి.

అఖిలపక్ష సమావేశం జరపాలి.

-సిపిఐ(యం)

స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రిపోర్టును బహిరంగపర్చాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం జరపాలని సిపిఐ(యం) కోరుతున్నది.

బిసి రిజర్వేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ కమిటీ జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించిన అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇందులో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇవ్వాలో కమిటీ పలు సూచనలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాగే రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా వివిధ ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది.

వాటిపైన ముఖ్యమంత్రితో సహా పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తపర్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లపై పలు పార్టీలు, సంఘాలు, సంస్థలు గత కొంతకాలంగా అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కావున కమిటీ తన రిపోర్టును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను బహిరంగ పర్చి అందరికీ అందుబాటులో ఉంచడం సముచితంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఈ నివేదికపై అఖిలపక్ష సమావేశం జరిపి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి