జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 ఆగష్టు, 2026.

జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి - సిపిఐ(యం)

స్టైఫండ్ పెంపు తదితర న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో ప్రభుత్వం చర్చలు జరిపి వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఆందోళన చేస్తున్న జూడాలకు సిపిఐ(యం) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది.

జూనియర్ డాక్టర్లు వేలాది మంది తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారు. రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడుతున్న జూనియర్ వైద్యుల శ్రమకు తగిన విధంగా స్టైఫండ్ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారు కోరుతున్న విధంగా 30% స్టైఫండ్ పెంచాలి. 

వైద్య విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయడంవల్ల ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే గత 4రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియుజేస్తున్నా ప్రభుత్వం స్పందిచకపోవడంతో సోమవారం నుండి అత్యవసర సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అందువలన ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జూనియర్ డాక్టర్లతో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే అంగీకరించి, సమ్మెను ముగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి