
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 జూలై, 2026.
విద్యార్థుల పోరాటం విజయం
22 మంది విద్యార్థులను బలి తీసుకొన్న “విద్యా మాఫియా” పై విజయం సాధించిన విద్యార్థులను, యువతీ యువకులను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందిస్తున్నది. ఎట్టకేలకు మోడీ ప్రభుత్వానికి యువశక్తి ముందు తలవంచక తప్పలేదు. రాజీనామా చేశాక కూడా ఉద్యమంపై జాతి వ్యతిరేకులంటూ నిందలు మోపడం సిగ్గుచేటు. ఇప్పటికైనా వాస్తవాలు అంగీకరించి విద్యా వ్యవస్థను కార్పొరేట్ చెరనుండి విముక్తి చేయాలి. లేదంటే మున్ముందు మరిన్ని ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దేశవ్యాపితంగా ఎంతో పట్టుదలతో, మొక్కవోని దీక్షతో పోరాడిన ఫలితంగానే కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైన నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని దేశవ్యాపితంగా వివిధ తరగతులు ఇచ్చిన మద్దతుతో విద్యార్థులు, యువకులు చేసిన పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
విద్యార్థుల కోర్కెలలో ప్రధానమైన విద్యామంత్రి రాజీనామా చేసినా ప్రశ్నాపత్రాల లీకేజిలకు ప్రధాన కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఎన్‌టిఏ రద్దుకు వ్యతిరేకంగా అలాగే విద్యా వ్యవస్థలో ఈ అవకతవకలకు మÖలకారణమైన ఎనఈపి (నూతన విద్యా విధానం 2020)కి వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో పోరాటం కొనసాగుతుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
