పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 జూలై, 2026.

పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

అత్యంత న్యాయమైన డిమాండ్‌పై విద్యార్థులు దేశవ్యాపితంగా శాంతియుతంగా సాగిస్తున్న పోరాటంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నిందలు మోపి, అన్యాయమైన ఆరోపణలు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

పరీక్షా పేపర్ లీక్‌చేసి అమాయకులైన విద్యార్థుల ఆత్మహత్యలకు, ఆయా కుటుంబాల క్షోభకు కారణమైన వారిపైన, తీవ్రమైన నిర్బంధంపైన ఒక్కమాట కూడా మాట్లాడని పవన్‌కళ్యాణ్‌కు విద్యార్థులను విమర్శించే హక్కు లేదు. దేశవ్యాపితంగా సాగుతున్న ఉద్యమానికి మేధావులు, సామాజిక వేత్తలు, వివిధ వర్గ ప్రజాసంఘాల నాయకులతోపాటు, సినీరంగ ప్రముఖులు, లబ్దప్రతిష్టులైన క్రీడాకారులు సంఘీభావం తెలుపుతున్నారు. అంత విశాలమైన ఉద్యమానికి వ్యతిరేకంగా రాళ్ళువేయడం ఎవరికి మేలు చేయడానికో ఉపముఖ్యమంత్రిగారే ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా విద్యార్థిలోకంపై తాను చేసిన నిరాధార ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, భేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి