ఏజెన్సీలో నిర్బంధానికి సిపియం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు ఖండన

స్క్రోలింగ్/ ప్రచురణార్ధం/ప్రసారార్ధం : 
ఏజెన్సీలో నిర్బంధానికి సిపియం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు ఖండన

నేడు రంపచోడవరం సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారని పేరుతో ఆదివాసీ గిరిజన సంఘం,  సీపీఐ (యం) నాయకులను నిర్బంధించారు, హౌస్ అరెస్ట్ లు చేయడాన్ని సీపీఐ (యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. 

 ఆదివాసీ యువత ఆగ్రహాన్ని గుర్తించి ఈ రోజు సభలో స్పెషల్ డియస్సీ ప్రకటించాలని, 1/70 చట్ట రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. 

పోలవరం నిర్వాసితులకు సమగ్ర పునరావాసం, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న గిరిజనుల కోర్కెలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి.