ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించడం హర్షణీయం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 14 జూలై, 2026.

 

ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించడం హర్షణీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును జూలై 24 వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఓటర్లకు తగిన అవగాహన లేకపోవడం, అవసరమైన పత్రాలు సమర్పించడానికి తగిన సమయం కావాలని, గడువు పొడిగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ గతంలోనే ఎన్నికల సంఘాన్ని కోరింది. అందుకనుగుణంగా గడువు పొడిగించడం వలన ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి మరింత వీలు కలుగుతుందని సిపిఐ(యం) భావిస్తున్నది. ఇప్పటికీ లక్షల ఫారాలు తిరిగి రావాల్సి ఉన్నందున అవసరమైతే మరికొంతకాలం గడువు పొడిగించాలని కోరుతున్నది.

ఎన్నికల సంఘం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎసఐఆర్ ప్రక్రియ నిర్వహించాలని సిపిఐ(యం) కోరుతున్నది. సాంకేతిక కారణాలతో ఓటు హక్కును తిరస్కరించకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి