అక్రమ అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూలై, 2026.

అక్రమ అరెస్టుకు ఖండన

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా కోడూరులో ట్రేడ్‌యూనియన్ నాయకులు సిహెచ్.చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.  ప్రస్తుతం చిట్వేల్ పోలీసు స్టేషన్ నిర్బంధంలో ఉన్నాడు. అరెస్టు చేసిన చంద్రశేఖర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.

ఉపాధిహామీ కొత్త పథకం ప్రారంభించడానికి కేంద్ర మంత్రి వస్తున్న సందర్భంగా నిరసనలు తెలియజేయాలని వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రజలకు శాపంగా మారుతున్న ఈ తప్పుడు పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న వారిని నిర్బంధంచడం అప్రజాస్వామికం.

గ్రామీణ పేదలకు మేలు చేసే (పాత) మహాత్మాగాంధీ ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి