గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పట్ల సిపిఐ(యం) హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 జూన్, 2026.

ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు రావడంపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఆయన పారాణిక, చారిత్రక నాటకాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి నాటక రంగానికి అనేక సేవలందించారు. ప్రజలకు చేరువగా నాటక, కళా రంగాన్ని తీసుకువెళ్ళటానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి