
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 మే, 2026.
ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు డా॥ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తున్నది. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది.
విద్యార్ధి దశ నుంచే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులై అధ్యాపక వృత్తిలో స్థిరపడినప్పటికీ గేయకవిత్వం రచనలో కృషి చేశారు. నవచేతన ప్రచురణ సంస్థలకు నాలుగు దశాబ్దాలు పాటు సంపాదకులుగా పనిచేశారు. తాపీ ధర్మారావు పై పిహెచ్‌డి చేసి తాపీ ధర్మారావు జీవితం ` రచనలు పుస్తకాలు వెలువరించారు. జాఘువా రచనలతో పాటు అనేక రచనలు చేశారు. ఆయన మృతి సాహిత్యరంగానికి తీరనిలోటు.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
