
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 మే, 2026.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలి
మోడీ ప్రభుత్వం పది రోజుల్లో మూడవసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచింది. పెట్రోల్‌పై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచడంతో గత పది రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ 4.77 పెట్రోల్, డీజిల్ రూ. 4.81 పైసలు పెంచింది. పెంచిన ధరలను ఉపసంహరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
చమురు సంస్థల ఒత్తిడితో పెట్రోల్, డీజిల్ ధరలను కనీసం లీటరుకు రూ.15 వరకు పెంచడానికి కేంద్రం సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చమురు కొరత లేదని, ధరలు పెరగవని ఎన్నికల ముందు చెప్పిన కేంద్రం నేడు వరుసగా పెంచడం ప్రజలను మోసగించడమే. ఒక్కసారిగా భారీగా పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని దశల వారిగా పెంచడం వంచించడమే.
ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని రకాల సరుకుల ధరలు మరింత పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్‌పై వేస్తున్న పన్నులను తగ్గించాలి. ఆవిధంగా ధరలను స్థిరంగా ఉంచి ప్రజల మీద పెంచిన ధరలను తగ్గించాలి.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
