
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 16 మే, 2026.
ప్రమాదంలో చనిపోయిన ఉపాధి కార్మికులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి
కాకినాడ జిల్లా చీడిక గ్రామంలో ఉపాధిహామీ పనులకు వెళ్ళి లారీ ప్రమాదంలో ఆరుగురు మహిళా ఉపాధి కార్మికులు మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నది. మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడినవారికి రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
బిజెపి మÖడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధిచట్టంలో కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చింది. పని ప్రదేశంలో హాజరు తీసుకోవడానికి ఫేస్‌యాప్ తెచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ గ్రామాల్లో నెట్ సౌకర్యం లేనందున హాజరు వేయాలంటే నెట్ సౌకర్యం ఉన్న చోటకి పేదలు వెళ్ళాలి. ఈరోజు మృతిచెందిన ఉపాధి కూలీలు కూడా ఫేస్‌యాప్ ద్వారా మస్టర్ వేయడానికి ప్రయత్నించగా నెట్ పనిచేయకపోవడంతో సిబ్బంది ప్రక్కనే ఉన్న హైవేపైకి తీసుకెళ్ళి హాజరు వేస్తుండగానే వేగంగా వచ్చిన లారీ ఆరుమంది కూలీలపై దూసుకెళ్ళింది. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
కావున ఉపాధి కూలీల హాజరుకు ఫేస్‌యాప్ పద్దతి రద్దు చేయాలి. మృతిచెందిన కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే అందేలా చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
