
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 మే, 2026.
ప్రజా రవాణాను బలోపేతం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనం పొదుపు చేయాలని చెబుతున్న నేపథ్యంలో, ప్రజల దైనందిన అవసరాలు తీరే విధంగా ప్రజా రవాణాను బలోపేతం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది.
రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలుతో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. అందుకు తగినన్ని బస్సులు లేక ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో సిటీ బస్సుల కొరత మరింత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుండి విద్యా, వైద్య అవసరాల కోసం, ఉపాధికోసం నిత్యం సమీప పట్టణాలకు వెళ్ళే వారు ప్రయివేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం అవసరం. అందుకోసం ఆర్టీసి బస్సులను పెంచడంతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు కూడా ప్రత్యేక వాహనాలను నిర్వహించడం సరైన ప్రత్యామ్నాయం అవుతుంది. తద్వారా ఇంధనం పొదుపు అవుతుంది. ప్రజలపై భారం తగ్గి సౌకర్యం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్యాసింజర్ రైళ్ళ సంఖ్యను తగ్గించి వేసింది. ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో కూడా జనరల్ బోగీలు తగ్గించి వేశారు. ప్యాసింజర్ రైళ్ళు పెంచడం, ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో జనరల్ బోగీలు పెంచడం ద్వారా ప్రజా రవాణాను బలోపేతం చేయవచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) కోరుతున్నది.
పరిస్థితులన్నీ సజావుగా ఉన్న సమయంలో వర్క్‌ఫ్రంహÃమ్ వంటివి అమలు చేస్తే ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందవలసిన సేవలకు, ప్రభుత్వాధికారుల జవాబుదారీతనానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
