నీట్ పేపర్ లీకేజి పట్ల సిపిఐ(యం) ఖండన

 

 

 

 

 

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 మే, 2026.

నీట్ పేపర్ లీకేజి పట్ల సిపిఐ(యం) ఖండన

నీట్ పరీక్షా పేపర్ లీకేజ్‌ను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. పరీక్షల నిర్వహణ నుండి ఎన్.టి.ఎ.ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నది.
లీకేజ్ దాదాపు 23 లక్షలమంది విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడిని గురిచేసింది. ఎన్‌టిఎ నిర్వహిస్తున్న అనేక పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలు, లీకేజీలు మొదటిది కాదు, ప్రారంభం నుండీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షా వ్యవస్థ యొక్క సమగ్రతను దెబ్బతీస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకరణ ఆలోచనతో దేశవ్యాప్తంగా ఎగ్జామ్ మాఫియా దారితీసింది. ఇది భారీ ఎత్తున కోచింగ్ మార్కెట్‌ను ప్రోత్సహించి, మధ్యతరగతి, పేద విద్యార్థులను, తల్లిదండ్రులను దోపిడీకి, అభద్రతాభావానికి గురిచేస్తోంది.
ఈ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపి వాస్తవాలు దేశ ప్రజలకు చెప్పాలి. విద్యార్థులు ఎదుర్కొన్న ఆర్థిక భారానికి పరిహారం చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరణ విధానాన్ని విడనాడాలి. ఎన్‌టిఏను రద్దు చేయాలని, గతంలో మాదిరిగా సంబంధిత ప్రభుత్వ సంస్థలకే ఆ బాధ్యత అప్పగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి