
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 మే, 2026.
వాణిజ్య సిలిండర్ ధర పెంపుదలను ఉపసంహరించుకోవాలి.
`సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్
19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై పెంచిన 993.50 రూపాయల అదనపు ఛార్జీని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ దాడి నేపధ్యంలో ఇప్పటికే ఒకసారి గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల నడ్డి విరగ్గొట్టింది. ఇపుడు మరలా అమాంతం దాదాపు మరో వెయ్యి రూపాయలు పెంచి చిన్న వ్యాపారస్తులను, టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లను కోలుకోలేని దెబ్బతీస్తుంది. గ్యాస్ కొరత వలన ఇప్పటి¹కే అనేక హోటళ్లు , టిఫిన్ సెంటర్లు మÖతపడ్డాయి లేదా పాక్షికంగా నడుస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో వందలాది మంది ఉపాధి కోల్పోయారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటివరకు ఆగిన కేంద్ర ప్రభుత్వం మరలా గ్యాస్ రేటు పెంచి వెన్నుపోటు పొడిచింది. గ్యాస్ రేట్ల పెంపుదలపై ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని ప్రజలకు సిపిఐ(యం) పిలుపునిస్తున్నది. ఈ క్రింది డిమాండ్లపై ప్రజలంతా ఏకమై పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నది.
1) పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
2) ఉపాధి కోల్పోయిన చిన్న చిన్న వ్యాపారస్తులకు, టిఫిన్ సెంటర్లకు ఆర్ధికంగా సహాయం చేసి ఆదుకోవాలి.
3) కేజీ బేసిన్‌లోని గ్యాస్, చమురులో 50% రాష్ట్రానికి ఇవ్వాలి.
4) గ్యాస్, ఆయిల్ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
