ప్రచురణార్ధం /ప్రసారరార్ధం / స్క్రోలింగ్ :
డీజెల్, పెట్రోల్ సంక్షోభం బాధ్యత ప్రభుత్వానిదే
నివారణకు తక్షణ చర్యలకు సీపీఐ (యం) డిమాండ్
రాష్ట్రంలో పెట్రోలు బ్యాంకులన్నీ నిండుకున్నాయి. వాహనాల రవాణా ఆగిపోయింది. పనులు మానుకొని ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో ఆయిల్ కోసం పహారా కాస్తున్నారు. జన జీవనం స్తంభించే పరిస్థితి ఏర్పడింది. ముందు చూపులేని ప్రభుత్వ విధానాలు, నిర్లక్ష్యం, అసమర్థ పాలనే ఈ దుస్థితికి కారణం. తక్షణం ఈ సమస్యపై దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికపై ఆయిల్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. లేని యెడల అశాంతికి గురయ్యే ప్రజలు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాము
వి శ్రీనివాస రావు
సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి
