విశాఖపట్నం కార్పొరేటర్ బి.గంగారావు అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 ఏప్రిల్, 2026.

విశాఖపట్నం కార్పొరేటర్ బి.గంగారావు అరెస్టుకు ఖండన

అదానీ గూగుల్ సెంటర్ ఏర్పాటు కానున్న విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో తర్లువాడ గ్రామ రైతుల పరామర్శకు వెళ్ళిన సిపిఐ(యం) నాయకులు కార్పొరేటర్ బి.గంగారావును, మరికొంత మంది నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.

అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన సిపిఐ(యం) నాయకులను గ్రామంలోకి రానీయకుండా, రైతుýతో ఎటువంటి సమావేశం నిర్వహించకుండా అరెస్టు చేయడం గర్హనీయం. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా గూగుల్ డేటా సెంటర్ పనులు చేపట్టకూడదని రైతుల ఆందోళనను అణచివేసేందుకు పోలీసులు భారీగా ఆ గ్రామంలో మోహరించడం అప్రజాస్వామికం.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు పునరావాస ప్యాకేజీ, నష్టపరిహారం చెల్లించిన తరువాతే గూగుల్ డేటా సెంటర్ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి