
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 మార్చి, 2026.
బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) తీవ్ర దిగ్బ్రాంతి
జగిత్యాల నుండి వింజమూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారు ఝామున మార్కాపురం దగ్గరలో రాయవరం వద్ద ప్రమాదానికి గురై 13 మంది సజీవ దహనం కావడం పట్ల సీపీఐ (యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మరణించినవారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలి.
ఇటీవల కాలంలో పదే పదే జరుగుతున్న బస్సు ప్రమాదాల పట్ల ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఈ ప్రమాదాలలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద కారణాలపై విచారణ జరపాలని, భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించి ప్రయివేటు కారియర్లపై పర్యవేక్షణ పెంచాలని, భద్రతా చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి, ఆసుపత్రిలోని క్షతగాత్రులను పరామర్శించారు.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
