బస్సు ప్రమాదంపై సిపిఎం తీవ్ర దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై సిపిఎం తీవ్ర దిగ్భ్రాంతి 

జగిత్యాల నుండి కనిగిరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది సజీవ దహనం కావడం పట్ల సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని మార్కాపురం జిల్లా కమిటీకి సూచించారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు వైద్య సహాయం అందించి ఆదుకోవాలని శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. 

ఇటీవల కాలంలో పదే పదే జరుగుతున్న బస్సు ప్రమాదాల పట్ల ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం వల్లనే ప్రమాదాలు పెరిగి ప్రాణ హాని జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రమాద కారణాలపై విచారణ జరపాలని శ్రీనివాస రావు డిమాండ్ చేశారు.

-జె.జయరాం
ఆఫీస్ కార్యదర్శి