
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 ఫిబ్రవరి, 2026.
కె.ఎన్.ఫణిక్కర్ మతికి సిపిఐ(యం) నివాళి
ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త మరియు ప్రజా మేధావి పద్మభూషన్ కె.ఎన్. ఫణిక్కర్ మృతికి సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నది. భారతదేశంలోని అగ్రశ్రేణి చరిత్రకారులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడిన ఫణిక్కర్ సోమవారం తిరువనంతపురంలో కన్నుమూశారు.
ఫణిక్కర్ శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా, కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్-ఛైర్మన్‌గా మరియు కేరళ చరిత్ర కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. జెఎన్‌యూలో సుదీర్ఘకాలం చరిత్ర బోధకుడుగా, అనేక అంశాలపై పరిశోధనలకు మార్గదర్శిగా పనిచేశారు.
మతతత్వశక్తులు కేంద్ర అధికారాన్ని హస్తగతం చేసుకుని చరిత్రను వక్రీకరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ప్రతిఘటించే వారు. భారతదేశ చారిత్రక వారసత్వ సంపదగా లౌకికవాదాన్ని గట్టిగా రుజువు చేసే ప్రయత్నం నిరంతరం చేసేవారు అని కొనియాడారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
