
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 ఫిబ్రవరి, 2026.
గూగుల్ పేరుతో అదానీ డేటా సెంటర్‌కు
వందల ఎకరాల భూకేటాయింపులు దారుణం
విశాఖలో గూగుల్ సంస్థ రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. కానీ దానికి భిన్నంగా దీన్ని మూడు ముక్కలు చేసి అదానీకి కేటాయిస్తున్నట్లు ఈ నెల 24వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ ప్రకటించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గత ప్రభుత్వం ఇదే అదానీకి ఋషికొండ `3లో 300 ఎకరాలు కేటాయించినా దాని ప్రారంభించÅ£పోయినా మరోచోట 600 ఎకరాలు కేటాయించటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. డేటా సెంటర్ పేరుతో వందలాది ఎకరాలు అదానీకి కట్టబెట్టడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గత 30 సంవత్సరాలుగా సింహచలం భూములులలో నివాసం వుంటున్న పంచ గ్రామాల ప్రజలకు పట్టాలివ్వకుండా ఇప్పుడు దేవస్థానం భూములను చట్టవిరుద్దంగా అదానీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నది.
విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం మండలం తార్లవాడలో 308 ఎకరాలతో పాటు మరో 106 ఎకరాలు భూమి సెమీ కండక్టర్‌కోసం కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఏఐ డేటా సెంటర్: విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో 1,000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఇన్‌ఫ్రా ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మూడు ప్రత్యేక కంపెనీలకు(SPVs) 601.4 ఎకరాల భూమిని కేటాయించనున్నారు.
అలాగే ఆడివివరం పంచాయతీ సింహాచలం దేవస్థానానికి సంబంధించి 256.47 ఎకరాల భూమి మరియు రాంబిల్లి మండలంలో ఎసఇజెడ్‌లో కొన్ని భూములు కేటాయించడం జరుగుతుంది. పేరుకి గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నా ఆ భూములన్నీ ఆదానికి కేటాయించడం జరుగుతుంది. గూగుల్ సంస్థ పెట్టనున్న డేటా సెంటర్‌ను అదానీకి కట్టబెట్టడం నిరుద్యోగులను మోసం చేయడమే. పేరు గూగుల్ భూమి మాత్రం అదానికి అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తార్లవాడలో ఉండే దళితులు దీన్ని వ్యతిరేకిస్తునప్పటికీ స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిడితో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనితో పాటు సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములు కేటాయించడం చర్చనీయాంశంగా విశాఖలో మారింది. దీనికి ప్రధాన కారణం 275 సర్వే నెంబర్లలో 6000 మంది పేదలు పాకలేసుకొని జీవిస్తూ ఉన్నారు. చిన్నగదిలి మండలంలో ఉన్న అడివి వరం, వెంకటాపురం మరియు పెందుర్తి మండలం వేపగుంట, చీములపల్లి, పురుషోత్తపురంలో దాదాపు 13 వేల మంది ప్రజలు దేవస్థానం భూముల్లో ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. వాటిని రెగ్యులర్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నది. ఈ భూమి సమస్య విశాఖ నగరంలో 17 వార్డులు, ఐదు అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు ఉన్న సమస్య. ప్రతీ ఎన్నికల సందర్భంగా ఈ భూ సమస్య పరిష్కరించేస్తామని పాలకులు తెలియజేస్తున్నా నేటికీ పరిష్కారం చేయకుండా మరింత జటిలం చేస్తున్నారు. వీరికి రెగ్యులర్ చేయడానికి దేవస్థానం భూములని చెప్పి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అదే దేవస్థానం భూములు మాత్రం ఆదానీ గెస్ట్ హౌస్ కోసం, డేటా సెంటర్ కోసం కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? గతంలో విశాఖ భూములు అదాని డేటా సెంటర్‌కి కేటాయించిన భూముల్లో నేడు కనీసం పని కూడా జరగకుండా ఆ భూముల మీద పెత్తనం చేస్తూ మళ్లీ నేడు గూగుల్ సెంటర్ పేరుతో ఆదానికి భూములు కట్టబెట్టడం దుర్మార్గమైన చర్య.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సింది పోయి ఆస్తుల్ని ప్రైవేటు కంపెనీలకి ధారాదత్తం చేయటం సరైంది కాదు. ఇప్పటికైనా అదానీకి కేటాయించిన విశాఖ భూములు రద్దు చేయాలని, ప్రభుత్వమే డేటా సెంటర్‌ను నిర్వహించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
