తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్‌బాబు యూనివర్శిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలి కిడ్నాపర్‌లను కఠినంగా శిక్షించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఫిబ్రవరి, 2026.

 

తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన 

మోహన్‌బాబు యూనివర్శిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలి

కిడ్నాపర్‌లను కఠినంగా శిక్షించాలి

తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి చెందిన గూండాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ధర్నాకు వెళుతున్న ఎసఎఫఐ జిల్లా కార్యదర్శి ఎస్.అక్బర్ ఎస్.వి.యూనివర్సిటీ నాయకుడు వినోద్ కుమార్‌పై దాడిచేసి కిడ్నాప్ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంతటి దారుణానికి పాల్పడిన యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది. విద్యార్థి సంఘం నాయకులపై దారుణానికి పాల్పడినవారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి. గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు ఇచ్చి పెనాల్టీ వేసినప్పటికీ ఎటువంటి మార్పు లేదు. విద్యని అందించాల్సిన యూనివర్సిటీ ఇటువంటి నేర ప్రవృత్తిగల వ్యక్తులను వినియోగించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులకు రక్షణ కల్పించి వారిని సురక్షితంగా తీసుకురావాలని పోలీసులను కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి