30న మహాత్మాగాంధీకి నివాళి ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జనవరి, 2026.

 

30న మహాత్మాగాంధీకి నివాళి

ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా జనవరి 30వ తేదీన రాష్ట్రవ్యాపితంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పాత చట్టం పునరుద్దరణకు ప్రతిజ్ఞ చేయాలని పార్టీ శ్రేణులు, లబ్దిదారులైన వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. 

కేంద్ర బిజెపి ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని దెబ్బతీసేలా జిరాంజీ పథకాన్ని తీసుకురావడం గ్రామీణ పేదలపై దాడి చేయడమే. పాత చట్టం హక్కుగా వ్యవసాయ కార్మికులు, కౌలు, పేద రైతులు, వత్తిదారులు, ఇతర గ్రామీణ పేదలకు మేలు చేస్తుంది. పాత చట్టంలో కల్పించాల్సిన 100 రోజుల పనే అమలు కాలేదు. కొత్త చట్టంలో 125 రోజులకు పెంచామని చెప్పడం వంచించడమే. నిజంగా పని దినాల పెంపుకే అయితే పాతచట్టంలోనే దాన్ని సవరించవచ్చు. ఆ పని చేయకుండా ఆ చట్టాన్ని రద్దుచేయడం దుర్మార్గం. కేంద్రం నిధుల వాటా తగ్గించడం రాష్ట్రాలపై అదనపు బరువు మోపడం, కొన్ని రోజులు నిషేదం, పనుల నిర్ణయం లబ్దిదారులు కాకుండా ప్రభుత్వమే నిర్ణయించడం ఇవన్నీ పాత చట్టాన్ని నీరుగార్చి దెబ్బతీసేవే. పాత చట్టం పరిరక్షణకు గ్రామీణ పేదలు ఐక్యంగా ఉద్యమించాలని, 30వ తేదీ గాంధీ వర్థంతి సందర్భంగా వాడవాడలా ఈ క్రింది ప్రతిజ్ఞ చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

 

ప్రతిజ్ఞ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ{్టం పరిరక్షణ కోసం

 

మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు, రైతు, కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి నేను అందరితో కలసి పోరాడుతాను.

గ్రామీణ పేదలమైన మనకు ‘పని’ హక్కును కల్పించిన చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది. గ్రామాభివద్ధికి తోడ్పడింది. పురుషులతో పాటు మహిళలకు సమానవేతనం ఇచ్చింది. వికలాంగులకు పనులు కల్పించింది. పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది. శ్రమకు గౌరవాన్ని ఇచ్చింది. వ్యవసాయాభివద్ధికి, గ్రామాభివద్ధికి తోడ్పడింది ఈ చట్టం.

పేదలకు పని హక్కును కాలరాసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ చ{్టం నుండి జాతిపిత మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాను.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ{్టం పరిరక్షణకు ఉద్యమిస్తానని గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను.

30.01.2026 (సంతకం)