
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 15 డిసెంబర్, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ‘టెట్’ మినహాయింపుకు కృషి చేయాలని కోరుతూ...
అయ్యా!
2025 సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు దేశవ్యాపితంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ ‘టెట్’ అర్హత పొందాలని, లేనిచో వారికి ఉద్యోగాల నుండి తొలగించాలని ఇచ్చిన తీర్పు దేశంలో 25 లక్షల మంది, రాష్ట్రంలో లక్ష మంది ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసినది. ఎస్‌టిఎఫ్‌ఐతో సహా అనేక ఉపాధ్యాయ సంఘాలు, తమిళనాడు, బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో 27 రివ్యూ మిటిషన్లు దాఖలు చేశాయి. యుటిఎఫ్ సహా ఆనేక ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. దీనికి పరిష్కారం జాతీయ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23 (2) సవరణ చేయడమే. మీరు చొరవ తీసుకొని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 23 (2)కి చట్ట సవరణ గానీ, ఆర్డినెన్సుగానీ జారీ చేయించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడవలసిందిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
