డా॥ వి.ఎన్‌.వి.కె. శాస్త్రి మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 డిసెంబర్‌, 2025.
డా॥ వి.ఎన్‌.వి.కె. శాస్త్రి మృతికి  సంతాపం
డా॥ విఎన్‌వికె శాస్త్రిగారు ఈరోజు హైదరాబాద్‌లో మరణించారు.  అతని మరణానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నది.
శాస్త్రిగారి మరణం ఆదివాసీ ఉద్యమానికి తీవ్రమైన లోటు. గిరిజన సమస్యలపై 10 రకాల పుస్తకాలు ప్రచురించారు. 100 రకాల వ్యాసాలు వ్రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన పరిశోధనా సంస్థలో డైరెక్టర్‌గానూ, ఏటూరి నగర్‌ ప్రాజెక్టు అధికారిగా అనేక బాధ్యతల్లో పనిచేసి గిరిజన ప్రజలకు సేవ చేశారు. తాను మరణించే వరకు గిరిజనులకోసం గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు, గిరిజనులను విద్య, వైద్యం, తదితర సమస్యలపై అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి మరణం ఆదివాసీ ఉద్యమానికి తీరనిలోటు.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org