
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 డిసెంబర్, 2025.
ప్రజాగాయకులు, సిపిఐ(యం) నాయకులు కామ్రేడ్ కె.పెంచలయ్య హత్యకు నిరసనగా నెల్లూరు జిల్లా బంద్ జయప్రదం చేసిన ప్రజానీకానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది.
గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య హత్యకు నిరసనగా జరిగిన బంద్‌కు వామపక్ష పార్టీలు, టిడిపి, వైసిపి, జనసేన, బిఎస్‌పి, విసికె, ఆప్, ఎమ్మార్‌పిఎస్, మాల మహానాడుతో పాటు పలు ప్రజాసంఘాలు, దళిత, గిరిజన, విద్యార్థి, యువజన, మహిళా, కళా, సాంస్కృతిక సంఘాలు ఏకోన్ముఖంగా మద్దతు తెలపడం హర్షణీయం. స్వచ్చందంగా రవాణా, వ్యాపార సంస్థలు, వ్యక్తులు దుఖాణాలు మూసివేసి నిరసన తెలపడం గంజాయి ముఠాకు చెంపపెట్టు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం సిపిఐ(యం) కొనసాగిస్తుంది. ఈ పోరాటానికి పార్టీలకతీతంగా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు మద్దతు ఇవ్వాలని సిపిఐ (యం) కోరుతున్నది. కామ్రేడ్ పెంచలయ్య కుటుంబానికి అండదండలిచ్చి, ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
