
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 నవంబరు, 2025.
ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి - అమాయకులపై వేధింపులు ఆపాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న, ఈరోజు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టుచేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా భూటకపు ఎన్‌కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయి. చట్ట విరుద్ధమైన భూటకపు ఎన్‌కౌంటర్లను సిపిఐ(యం) ఖండిస్తున్నది.
విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించారు. వివిధ చోట్ల నిర్బంధించబడిన వీరిని వెంటనే సంబంధిత న్యాయ స్థానాల ముందుంచాలని కోరుతున్నది.
అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేధింపులను, నిర్భందాన్ని వెంటనే నిలిపివేయాలని, సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
