బిర్సా ముండా స్పూర్తితో ఆదివాసీ హక్కుల కోసం పోరాటం

(ఈరోజు (15 నవంబర్‌, 2025) ఆదివాసి సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి నివాళి కార్యక్రమం సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

బిర్సా ముండా స్పూర్తితో ఆదివాసీ హక్కుల కోసం పోరాటం
ప్రభుత్వాల అండతో ఏజెన్సీలో కార్పొరేట్‌  నిలవువు దోపిడీ
జయంతి కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో సహజ వనరులను కార్పొరేట్లు పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారని, ఆదివాసీ సమరయోధుడు బిర్సాముండా స్ఫూర్తితో దీనికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావ అన్నారు. ఆదివాసీ సమరయోధుడు బిర్సాముండా 150వ జయంతి కార్యక్రమంలో శనివారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. బిర్సాముండా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జార్ఖండ్‌లో స్వాతంత్య్రానికి పూర్వం భూస్వాములు పేదలపై ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలపై మారణకాండ సృష్టించారని, సహజ వనరులను దోపిడీ చేశారని అన్నారు. మరోవైపు బ్రిటీష్‌వారు అటవీ భూములను లాగేసుకోవడంతోపాటు, ఉత్పత్తులపై పన్ను విధించారని, దీంతో 25 ఏళ్ల వయస్సులో బిర్సా ముండా వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని తెలిపారు. ప్రజలను కూడగట్టి బ్రిటీష్‌వాళ్లను గడగడలాడిరచారని తెలిపారు. ఆదివాసీ కుటుంబంలో పుట్టి బ్రిటీష్‌వాళ్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్ర పుటల్లో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్నారని అన్నారు. ఆస్తులు, భూములు, నేల, నీరు అన్నిటినీ పెట్టుబడుల కోసం దురాక్రమణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో బిర్సాముండా లాంటి యోధుల స్పూర్తితో పోరాడాలని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో హైడల్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌ పేరుతో సాగిస్తున్న దోపిడీ ఏజెన్సీ ప్రాంతాల ఉనికిని ప్రశ్నిస్తోందని అన్నారు. అదే సమయంలో ప్రాజెక్టుల పేరుతో గిరిజనులను తరిమేస్తున్న ప్రభుత్వాలు గిరిజనుల పునరావాసం గురించీ పట్టించుకోవడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 12శాతం పునరావాసం కూడా పూర్తికాలేదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కనీస సదుపాయాలు లేవని అన్నారు. ఎన్నికల ముందు తాము అధికరాంలోకి వస్తే ఏడాదిలోపు డోలీ సంస్కృతి లేకుండా చేస్తానని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ చెప్పారని, ఏడాదిన్నర అవుతున్నా అడుగు ముందుకు పడలేదని అన్నారు. పివిటిజిలు మరింత వెనుకబడి ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీలను మరింత వెనుకబాటుకు గురిచేసే పనులు చేస్తోందని తెలిపారు. బిర్సా ముండా హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా, బ్రిటీష్‌ దోపిడీని కాపాడేందుకు వచ్చిన క్రిష్టియన్‌ మిషనరీలకు వ్యతిరేకంగా పోరాడారని ప్రత్యామ్నాయంగా బిర్సాయిట్‌ మతాన్ని స్థాపించారని అన్నారు. నేడు బిజెపి బిర్సా ముండాను క్రిష్టియన్‌ వ్యతిరేకుడిగా చూపించి చరిత్రను వక్రీకరిస్తున్నదని అన్నారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడనీ బిర్సాముండా త్యాగాన్ని శ్రీనివాసరావు కొనియాడారు.
బీహార్‌లో ప్రజల మధ్య బిచ్చుపెట్టి గెలిచారు
బీహార్లో బిజెపి విజయం నిజమైన ప్రజాతంత్ర విజయం కాదని అన్నారు. ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి, ఓటర్ల లిస్టులను తారుమారు చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. ప్రభుత్వ స్కీములను కూడా ఎన్నికల కోసం వినియోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పదివేలు మహిళల ఖాతాల్లో వేసి ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేశారని అన్నారు. బీహార్లో ఇప్పటికీ అరాచకం, హింస, అత్యాచారాలు, మైనింగ్‌, బొగ్గు, ఎడ్యుకేషన్‌ మాఫియా తీవ్రంగా ఉందని అన్నారు. కేంద్రంలో ఎన్‌డిఏ కొనసాగితే  మన రాష్ట్రం కూడా మరో బీహార్‌గా మారుతుందని అన్నారు. సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ ప్రజలను సమీకరించి సాయుధ పోరాటాన్ని కొనసాగించి అత్యంత పిన్నవయస్సులో బిర్సా ముండా వీరమరణం పొందారని అన్నారు. ఆయన పోరాటం ఫలితంగా నాటి బ్రిటీషు ప్రభుత్వమే అటవీ భూమిపై హక్కులు కల్పించే చట్టం తీసుకువచ్చారని అన్నారు. అలాగే ఆదివాసీ సంస్కృతి అభివృద్ధికి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం, యం.సూర్యారావు, యం.హరిబాబు, జి.రామన్న తదితరులు పాల్గొన్నారు.
= = = =
 

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org