కాశీబుగ్గ ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 నవంబరు, 2025.

 

కాశీబుగ్గ  ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 10 మంది మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండడం విచారకరం. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ ఘటనలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.

శనివారం ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకుల వైఫల్యం కనపడుతున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. ఆలయాల్లో భక్తుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి