
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 సెప్టెంబరు, 2025.
పాలకుల సరళీకరణ విధానాలతో పట్టణాలలో పెరుగుతున్న అసమానతలు
తమ దోపిడీకి పట్టణాలను కేంద్రాలుగా మార్చిన కార్పొరేట్ సంస్థలు
పట్టణాలలో పెరుగుతున్న మతోన్మాద ప్రమాదం
పట్టణ ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉదృతం చేయండి
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు,
రాష్ట్ర కార్యదర్శి వి .శ్రీనివాసరావు పిలుపు
నిన్న ,ఈరోజు విజయవాడలోని మాకినేని బసవన్నయ్య విజ్ఞాన కేంద్రంలో భారత
కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ
ప్రాంత రాష్ట్ర కార్యకర్తల సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
వై .వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశాన్ని బీవీ రాఘవులు ప్రారంభించగా, వి శ్రీనివాసరావు ముగించారు,
పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కూడా
ప్రసంగించారు.
22 జిల్లాలకు నుండి 55 నగరాలు, పట్టణాల చెందిన నేతలు, కార్యకర్తలు ఈ
సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో బివి రాఘవులు ప్రసంగిస్తూ... బడా కంపెనీలు పట్టణాలను తమ
దోపిడీకి కేంద్రాలుగా మార్చారు .కార్పొరేట్ ,బహుళ జాతి కంపెనీలు ప్రతి
నివాసాన్ని తమ దోపిడీకి అడ్డాలుగా మారుస్తున్నారు. వివిధ రూపాలలో ప్రజలను
పీల్చి పిప్పి చేస్తున్నారు. అదనపు లాభాల కోసం బడా సంస్థలు.. రియల్
ఎస్టేట్, నిర్మాణ రంగాన్ని సాధనంగా మార్చుకున్నారు. సామాన్యులకు మాత్రం
గృహ వసతినీ గగనంగా మార్చారు.
గతంలో ప్రభుత్వ రంగంలో పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు
కల్పించగా నేడున్న బిజెపి కేంద్రం నేడు వాటిని వ్యాపార సరుకులుగా
మార్చింది. పట్టణాలలో మురికివాడలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి .ఒకవైపు
బడా కంపెనీలు బలిసిపోతుండగా పేదలు చితికి పోతున్నారు. అసమానతలు
పెరిగిపోతున్నాయి. బిజెపి ,ఆర్‌ఎస్‌ఎస్ తదితర మతోన్మాద సంస్థలు
విద్వేషాలను రెచ్చగొట్టడానికి పట్టణాలను కేంద్రాలుగా
వినియోగించుకుంటున్నాయి. దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను ఆసరాగా చేసుకుని
ఉన్మాద విష బీజాలు నాటుతున్నారు. సామరస్యంతో జరుపుకునే పండుగలు,
ఉత్సవాలలోను మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు. ఈ స్థితిలో పట్టణాలలో
ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉదృతం చేయాలి. మతోన్మాద
శక్తులను ఎదుర్కోవాలి. కార్పొరేట్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.
కేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలి. మత సామరస్యాన్ని
పెంపొందించాలి. ప్రజలను ఐక్యం చేయాలి.
రాష్ట్ర కార్యదర్శి వి .శ్రీనివాసరావు ప్రసంగిస్తూ..... నేపాల్ లో
పాలకులపై పెరిగిన అసంతృప్తి యువతలో ఒక్కసారిగా పెల్లిబుకింది. మనదేశంలో
నిరంకుశ పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఇది హెచ్చరిక కావాలి. యువత,
ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలు తప్పవని గమనించాలి.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పట్టణాలను, రాజధాని నిర్మాణాన్ని కార్పొరేట్ల
ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాల దృష్టితో అభివృద్ధి చేయాలి. పన్నుల
పెంపుపై కాకుండా సౌకర్యాల కల్పనప దృష్టి పెట్టాలి. పట్టణాల్లో ప్రజారోగ్యం
క్షీణిస్తున్నది. పాలకుల విధానాలే పట్టణ ప్రజల జీవితాలను
దెబ్బతీస్తున్నాయి. రాబోయే కాలంలో పట్టణ ప్రజల సమస్యలపై సిపిఎం ప్రత్యేకమైన
ఉద్యమాలు సాగిస్తుంది. కేంద్రానికి లొంగిపోతున్న టిడిపి, జనసేన
ప్రతిపక్షంగా ఉన్న వైసిపి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి. కేంద్ర
మోడీ ప్రభుత్వ విధానాలపై జరిగే పోరాటంలో పట్టణ ప్రజలు ముఖ్య పాత్ర
వహించాలి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకై జరిగే ఉద్యమంలో చురుకుగా
పాల్గొనాలి.
మతోన్మాద, విద్వేష శక్తుల ఎడల అప్రమత్తతో ఉండి తిప్పి కొట్టాలి.
సమావేశంలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.
భవిష్యత్తులో పట్టణ ప్రజల సమస్యలపై ఆందోళన, పోరాట కార్యక్రమాలు చేపట్టాలని
నిర్ణయించారు. మతోన్మాద శక్తులను ఎదుర్కోవటానికి రాజకీయ, సైద్ధాంతిక,
బహుముఖ కృషిని ముమ్మరం చేయటానికి తగు కార్యక్రమాలు రూపకల్పన చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
