కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా టారిఫ్‌లను ఎదుర్కోవాలి..

(ఈరోజు (1 సెప్టెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అమెరికా టారిఫ్‌లను ఎదుర్కోవాలి

బహుళధృవ ప్రపంచాన్ని బలపరచాలి 

దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్‌ చేస్తున్న అమెరికా 

జనసేనకు సిద్ధాంతమేదీ లేదు

5న రైతుల ఆందోళనను బలపరుస్తున్నాం

విశాఖ స్టీలుప్లాంటు అమ్మకంపై కూటమి సమాధానం చెప్పాలి

పోలవరం నిర్వాసితుల కష్టాలు పట్టడం లేదు

 

అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా పడుతోందని, దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవితో కలిసి ఆయన మాట్లాడారు. అమెరికా టారిఫ్‌లతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతుంటే టిడిపి, జనసేన కూటమి, వైసిపి  స్పందించడం లేదన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్‌ చేస్తున్నా, అన్ని విషయాల్లోనూ దేశాన్ని పక్కన బడేస్తున్నా ఈ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయో, ఎదుర్కోడానికి ఎందుకు సిద్ధపడటం లేదో అర్థం కావడం లేదన్నారు. స్పందన లేకుండా ఉండటం కలిచిస్తోందని తెలిపారు. టారిఫ్‌ల వల్ల రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రంగం దెబ్బతిందని, ఎగుమతి చేయాల్సిన సరుకు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలన్నారు. టారిఫ్‌వల్ల వచ్చే ఇబ్బందులను గుర్తించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక అధ్యయన కమిటీని నియమించి ఎలా ఎదుర్కోవాలనేది పరిశీలన చేయాలన్నారు. ఏడాదికి రూ.1600 కోట్ల ఆదాయం తెస్తున్న ఆక్వా రంగానికి ఎగుమతి సబ్సిడీ ఇవ్వవచ్చని, విద్యుత్‌, ఫీడ్‌, సీడ్‌ రేట్లపై రాయితీలు ప్రకటిస్తే తట్టుకుని నిలబడుతుందని అన్నారు. ఆక్వా రంగంలో సగం ఎగుమతులు అమెరికాకు అవుతున్నాయని, దానికి ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని సూచించారు.

గార్మెంట్‌ పరిశ్రమ దెబ్బతింటోంది

గార్మెంట్‌ పరిశ్రమ కూడా దెబ్బతింటోందని అన్నారు. అనకాపల్లి జిల్లాలో 23 వేలమంది గార్మెంట్‌ రంగంలో పనిచేస్తుంటే నాలుగు నెలలకాలంలో 18వేల మందికి తగ్గిపోయారని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులు ఆచరణలో కనిపించడం లేదని, ఉన్న ఉపాధి, ఆదాయాలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. సత్యసాయి జిల్లాల్లో ఐదారువేల మంది ఉపాధి పోతోందన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఇప్పటికే ట్రూఅప్‌ ఛార్జీల వల్ల స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడ్డాయని అన్నారు. అదే సమయంలో కేంద్రం పత్తి దిగుమతులపై సుంకం రద్దు చేయడంతో రైతులు బలైపోతున్నారని తెలిపారు. టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీని ఆదుకోవాలంటే ఎగుమతి సబ్సిడీ ఇవ్వాలన్నారు. దానివల్ల రైతులకు లాభం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా 5వ తేదీన రైతు సంఘాలు ఆందోళనకు పిలుపుఇచ్చాయని, సిపిఎం పక్షంగా దాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. ఈలోపు రాష్ట్రం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పత్తి దిగుమతులపై సుంకం విధించేలా చూడాలన్నారు. 

ప్రైవేటీకరణకు సహకరిస్తూ బుకాయింపులు 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ముక్కలు చేసి అమ్మేస్తుంటే స్పందించకపోగా టిడిపి, జనసేన నాయకులు ప్రైవేటీకరణ జరగదని బుకాయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు గంభీర ప్రకటనలు చేసిన పవన్‌కల్యాణ్‌ విశాఖలో జరుగుతున్న జనసేన సమావేశంలో ప్లాంటు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని అన్నారు. అమ్మకాలు జరిగిపోతున్నా ప్రైవేటీకరణ ఆపుతున్నామంటూ ప్రకటనలు చేయడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. ఉక్కును అమ్ముతామని కేంద్ర క్యాబినెట్‌ నిర్నయించిందని, ఆపాలన్నా క్యాబినెట్‌ తీర్మానం చేయాలని అన్నారు. అటువంటిదేమీ చేయలేదని, పైగా గత పార్లమెంటు సమావేశాల్లో స్ట్రాటజిక్‌సేల్‌ ఆపలేదని కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ప్లాంటుకు రూ.11,400 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో వివరాలు బయటపెడితే అసలు భండారం తేలిపోతుందని తెలిపారు. వచ్చి నిధుల్లో రూ.1545 కోట్లు మినహా మొత్తం జిఎస్‌టి, బ్యాంకు వడ్డీల పేరుతో కేంద్రమే వెనక్కు తీసుకుందన్నారు. 46 విభాగాల్లో ప్రైవేటీకరణకు ఇఓఐ టెండర్లు పిలిచినా అలాంటిదేమీ లేదని టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బుకాయిస్తున్నారని అన్నారు. పైగా సిబ్బంది వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టెండర్లు పిలిచారో లేదో పల్లా శ్రీనివాసరావు సమాధానం చెప్పాలన్నారు. ప్లాంటు మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్ముతామని మోడీ చెప్పిన మాట అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిని అడ్డుకోవడం చేతగాని పవన్‌ కల్యాన్‌ పవన్‌ కల్యాణ్‌ కార్మిక సంఘాలు, కార్మికులపై నెపం నెడుతున్నారని అన్నారు. ఉత్పాదకత తగ్గిపోవడానికి ఎవరు కారణమో చెప్పాలన్నారు. ప్రైవేటీకరించాలని కోరిన కార్మిక సంఘాల నాయకులు ఎవరో బయపట్టాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు. 2023లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మూడు పనిచేస్తే లాభాలు వచ్చాయని, 2024లో వాటిని ఆపేసి నష్టాలు వచ్చేలా చేశారన్నారు. ప్రకాశం నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ఐరన్‌ ఓర్‌ గనులను జిందాల్‌కు ఇచ్చారన్నారు. లోకేష్‌ ఎన్‌డిఎంసి టెండర్లలో పాల్గని ప్లాంటు గనులు కొనుక్కోవచ్చిన ఢల్లీిలో ప్రకటన చేశారని, అదే సమయంలో తెలుగుదేశం ఎంపిలు కేంద్ర స్టీలు మంత్రిని కలిసి ఆర్సెల్లర్‌ మిట్టల్‌కు గనులు కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారని అన్నారు. ప్రత్యక్షంగా తెలుగుదేశం, జనసేన ప్లాంటు ప్రైవేటీకరణకు తోడ్పడుతున్నాయని తెలిపారు. అక్కడ ఐదేళ్లుగా దీక్షలు నడుస్తుంటే దీక్షా శిబిరాన్ని ఎత్తేసి రోడ్డుపై పడేశారన్నారు. కార్మికుల ప్రజాస్వామిక హక్కులను కూడా హరించి వేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కూడా రాష్ట్రం కేంద్రం కుట్రలకు తోడవుతోందని, ఇద్దరూ కలిసే చేస్తున్నారని అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డగోలుగా భూములు లాక్కుంటోందని, సిపిఎంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పైగా రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కరేడులో భూములు తీసుకోవడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ప్రజల మధ్య వివాదాలు పెడుతున్నారని పేర్కొన్నారు. చిన్న ఘర్షణలకు అక్కడి మహిళలను జైళ్లపాలు చేస్తున్నారని తెలిపారు. 

పోలవరం వర్కు డాక్యుమెంటేషన్‌ లేదు

పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, వర్కు డాక్యుమెంటేషన్‌ జరగడం లేదని పోలవరంపై విదేశీ నిపుణులు తెలిపారని, అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వివరాలు లేకపోతే నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారో తెలపాలన్నారు. ప్రాజెక్టులకు కేంద్రం రూ.12000 కోట్లు ఇస్తే 900 కోట్లు పునరావాసానికి ఇచ్చి అందులోనూ రూ.500 కోట్లు కాంట్ట్రాక్టర్లకు ఇచ్చారని అన్నారు. 400 కోట్లు మాత్రమే పునరావాసానికి ఇస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు స్వయంగా మునక ప్రాంతాల ప్రజల దుస్థితిని పరిశీలించి అక్కడ ప్రజల సంక్షేమాన్ని చేపట్టాలని కోరారు. పునరావాస కాలనీల కాలనీల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండు చేశారు. 

బహుళధృవ ప్రపంచాన్ని బలపర్చాలి  

దేశ మూలాలను భారత్‌ అమెరికా సంబంధాలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో భారత్‌ చైనా సంబంధాల పునరుద్ధరించబడటం మంచి పరిణామమని, ఆహ్వానిస్తునానమని శ్రీనివాసరావు తెలిపారు. ట్రంప్‌, మోడీ ఒకే కంచం ఒకేమాట అని ఎన్నికల్లో పరస్పరం ప్రచారం కూడా చేసుకున్నారని తెలిపారు. అయినా భారతదేశానికి అమెరికా కనీస విలువ ఇవ్వకపోగా తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధం ఉన్నంతకాలం ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. బహుళ ధృవప్రపంచం వైపువెళుతుంటే దానికి అనుగుణంగా వెళ్లాలని అన్నారు. అమెరికా ఏకఛత్రాధిపత్యం బద్ధలైందని, చిన్న, చిన్న దేశాలు కూడా దాన్ని సవాల్‌ చేస్తున్నాయని తెలిపారు. బహుళ ధృవ ప్రపంచాన్ని బలపర్చాలన్నారు. చైనా ఒక్క గజం కూడా భారతదేశ భూమిని తీసుకోలేదని పార్లమెంటులో కేంద్రం తెలిపిందన్నారు. ఒక్క దేశంపై ఆధారపడటం కాదని, అన్ని దేశాలతో కలిసి పనిచేయాలని అన్నారు. రష్యావల్ల అయిల్‌ ధర నిలకడగా ఉందని, లేకపోతే ఆకాశానికి పాకేదని అన్నారు. అమెరికా మాట వింటే నష్టపోయేవారిమని అన్నారు. అమెరికా తొత్తుగా ఉన్న సౌదీ అరేబియా కూడా ఇప్పుడు బహుళ ధృవ ప్రపంచంలోకి వస్తోందని అన్నారు. 

జనసేన సిద్ధాంతం లేదు 

జనసేన సిద్ధాంతం ఏమిటో వారి పార్టీ వాళ్లకు కూడా తెలియదని శ్రీనివాసరావు తెలిపారు. సిద్ధాంత నిబద్ధత లేదని, ఎప్పుడు ఏది కావాలంటే అదే చెబుతున్నారని తెలిపారు. జనసేన అంశంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు శ్రీనివాసరావు స్పందించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కల్యాణ్‌ కేంద్రంతో పోరాడి నిధులు తేవాల్సిందిపోయి ఆర్‌ఎస్‌ఎస్‌ మౌత్‌పీసులాగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

 

= = = =