ప్రత్యామ్నాయ అభివృధి వ్యూహంతో వామపక్షాలు కలసికట్టుగా పోరాడాలి

(ఈరోజు (24 ఆగష్టు, 2025) సిపిఐ రాష్ట్ర మహాసభల్లో వి.శ్రీనివాసరావు
సౌహార్థ సందేశం వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. -
జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ప్రత్యామ్నాయ అభివృధి వ్యూహంతో వామపక్షాలు కలసికట్టుగా పోరాడాలి
వి.శ్రీనివాసరావు, సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి
        ఈ రోజు ఒంగోలులో ఆరంభమైన సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల్లో సిపిఐ(యం) రాష్ట్ర
కార్యదర్శి వి. శ్రీనివాసరావు సౌహార్థ సందేశం.
        సురవరం సుధాకర్‌ రెడ్డికి శ్రద్ధాంజలి.
        రాష్ట్ర మహాసభకు విచ్చేసిన నాయకులు, ప్రతినిధులకు శుభాకాంక్షలు
        దేశ ప్రజలపై ఇంటా, బయటా దాడి.
        ట్రంప్‌ సుంకాల పేరుతో దాడి. లొంగిపోయిన మోడీ. ప్రజాస్వామ్యంపై మతోన్మాద
బిజెపి దాడి. నేర చరిత్ర  కలిగిన అత్యధిక ప్రజా ప్రతినిధులు బిజెపిలోనే
ఉన్నారు.
        రాష్ట్రంలో పెరుగుతున్న మతోన్మాద ప్రమాదం,  రాష్ట్రంలో పేరుగుతున్న నేరస్థ
రాజకీయాలు.
        కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్‌ అనుకూల విధానాలు. అంబానీ, ఆదానీలకు
ఆంధ్రప్రదేశ్‌ అప్పగింత. విశాఖ  ఉక్కును ఫణంగా పెట్టీ ఆర్సెల్‌ మిట్టల్‌
కోసం అధికార కూటమి ఎంపీల లాబీ క్షమార్హం కాదు.
        వామపక్ష ఉద్యమాలు, పార్టీలు బలపడితేనే మతోన్మాదానికి అడ్డుకట్ట వేయగలం.
        నూతన రాజకీయ సంస్కృతికి ఐక్య ప్రజా ఉద్యమాలే ఆలంబన.
        దళితులు మహిళలు బలహీన వర్గాలపై దాడులు.
        కార్పొరేట్లకోసం ఇష్టానుసారం బలవంతంగా భూసేకరణ. ప్రతిఘటించిన రైతులపై
నిర్బంధం
        ఇంతవరకు ఏక్కడా ఒక్క పరిశ్రమా పెట్టలేదు, ఒక్క ఉద్యోగమూ సృష్టించ లేదు.
        చంద్రబాబు అభివృధి మంత్రం కార్పొరేట్లకు సంపద కట్ట బెట్టడానికే.
        నిరంతరం ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిసినెస్‌, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిసినెస్‌
అంటూ కార్పొరేట్లతో సమ్మిట్లు జరిపే చంద్రబాబు కార్మిక, రైతు సంఘాలతో
ఎందుకు మాట్లాడరు.
        వ్యవసాయాన్ని నాశనం చేసి పరిశ్రమలు అభివృద్ధి చేయలేరు.
        ప్రజా ఉద్యమాలపై నిర్బంధం విద్యార్థి సంఘాలపై పరోక్ష నిషేధం.
        ఆగస్టు 28 విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రతిజ్ఞ దినం -
విద్యుత్‌ పోరాటవేదిక ఆధ్వర్యంలో  జరిగే సదస్సులు - పబ్లిక్‌ హియరింగ్‌ -
విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రతిఘటన ఉద్యమానికి మద్దతు.
        వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యామ్నాయ వ్యూహం. రాయలసీమ, ఉత్తరాంధ్ర
ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక  ప్యాకేజీ. హంద్రీ నీవా - వెలిగొండ - వంశధార
వంటి ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యత.
        ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖచిత్రంగా పవన్‌ కళ్యాణ్‌. ప్రశ్నించడానికే జనసేన
పుట్టిందన్న పవన్‌ ప్రశ్నిస్తే అణచివేస్తామంటున్న బిజెపితో కలిసింది.
        ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడాల్సిన వైసిపి విఫలమైంది. ప్రజలిచ్చిన
బాధ్యతను విస్మరించింది. ప్రజా క్షేత్రంలో ఆపని వామపక్షాలు చేయాలి.
        అసమానతలు లేని అభివృద్ధి కోసం వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర శక్తులతో కలసి
ఐక్యంగా పోరాడాలి.
        కేంద్రం ఆర్థిక దిగ్బంధనం మధ్య ఎన్నో పరిమితులున్నపటికీ మానవాభివృద్ధిలో
ముందున్న కేరళ. వామపక్ష పాలనే కారణం. 100 శాతం డిజిటల్‌ లిటరసీ సాధించిన
రాష్ట్రం అదొక్కటే. వామపక్షాలు అసమానతలు లేని అభివృద్ధి కోరుకుంటాయి.
వామపక్ష ప్రజాతంత్ర శక్తులతోనే రాష్ట్ర సమగ్రాభివృది సాధ్యం.
        ఐక్య ఉద్యమాలతోనే రాష్ట్రానికి ప్రత్యామ్నాయం. సిపిఐ, సిపిఐ(యం) అందుకు
కలసికట్టుగా కృషి చేయాలి.
= = = =
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org