ఆగష్ట్టు 16, 17 తేదీలలో యం.ఏ.బేబీ, జాన్‌ బ్రిట్టాస్‌ పోలవరం మునక ప్రాంతాల్లో పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఆగష్టు, 2025.

 

ఆగష్ట్టు 16, 17 తేదీలలో 

యం.ఏ.బేబీ, జాన్‌ బ్రిట్టాస్‌ పోలవరం మునక ప్రాంతాల్లో పర్యటన

సిపిఐ(ఎం) అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ యం.ఏ.బేబీ, రాజ్యసభ ఎంపి, సిపిఎం ప్లోర్‌ లీడర్‌ కామ్రేడ్‌ జాన్‌ బ్రిట్టాస్‌ ఈనెల 16,17 తేదీలలో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసిత, మునక ప్రాంతాల సమస్యలను పరిశీలించడానికి ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కా॥ బేబీ 16వ తేదీ మధ్యాహ్నం రాజమండ్రి ఎయిర్‌ పోర్టుకి చేరుకొని అక్కడ నుండి రంపచోడవరం దగ్గరనున్న దేవీపట్నం మండలంలో ఉన్న పెనికెలపాడు, ఇందుకూరు, తాల్లూరు ప్రాంతాల్లో ఉన్న నిర్వాసిత కాలనీల్లో పర్యటిస్తారు. కా॥ జాన్‌ బ్రిట్టాస్‌ 16వ తేదీ మధ్యాహ్నం విజయవాడ చేరుకొని ఏలూరు జిల్లాలో ఉన్న జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో ప్రజల్ని కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. 17వ తేదీన కామ్రేడ్‌ ఎం.ఎ.బేబీ, జాన్‌ బ్రిట్టాస్‌లు చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో ఉభయులు పర్యటించి మధ్యాహ్నం నుండి తిరుగు ప్రయాణమై ఢల్లీికి వెళ్తారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని యావన్మంది ప్రజలను కోరుచున్నాము. 

పోలవరం డ్యాం పనులు సాగుతున్నప్పటికీ నిర్వాసితుల పునరావాసం నత్తనడక నడుస్తోంది. వారికి ఇవ్వాల్సిన ఆర్‌Êఆర్‌ ప్యాకేజ్‌ ఇవ్వలేదు. ప్రభుత్వం నిర్మించిన కాలనీలలో కనీస సౌకర్యాలు లేవు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ నేటికీ ఇవ్వలేదు. నిర్వాసితుల సమస్యలను పట్టించుకునే నాధుడే లేడు. నిర్వాసితులు, ముంపుకు గురైన ప్రాంత ప్రజలు అభద్రతా భావంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో  ఈ ప్రాంతాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడానికి పార్టీ నాయకత్వం పర్యటిస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి